'ప్రతి మ్యాచ్‌లో ఇదే వ్యూహం పాటిస్తే ఫెయిల్ కాడు': సంజూ శాంసన్‌పై గవాస్కర్ ప్రశంసలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భారతదేశం

అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి అద్భుత ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, ఈ మ్యాచ్‌లో సంయమనం పాటిస్తూ పిచ్‌పై సెట్ అయ్యాక బౌలర్లపై విరుచుకుపడిన తీరు అద్భుతమని, ఇదే వ్యూహాన్ని ప్రతి మ్యాచ్‌లోనూ పాటిస్తే కెరీర్‌లో ఎప్పటికీ ఫెయిల్ కారంటూ గవాస్కర్ కీలక సలహా ఇచ్చారు.