'మహిళా సాధికారతే సమగ్ర అభివృద్ధికి పునాది': దక్షిణాఫ్రికా సదస్సులో పురందేశ్వరి

రిపోర్టర్: రాజేష్ స్థలం: దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భారతదేశ ప్రతినిధిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని మహిళా సాధికారత, లింగ సమానత్వంపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే భారత దేశంలో మహిళలకు సమాన ఓటు హక్కు, సమాన అవకాశాలు కల్పించబడ్డాయని ఆమె గుర్తు చేస్తూ, మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి నిజమైన పునాది అని గట్టిగా ఉద్ఘాటించారు.