హంతకుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాలని బి.కొత్తకోటలో ఉద్రిక్తత
రిపోర్టర్: మహేష్
స్థలం: B.Kothakota, Annamayya District
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోపాల్ రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలని, అమాయకులను ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ నాయనబావి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వెంటనే స్పందించి నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.