దారుణం: సీనియర్ న్యాయవాదిని అపహరించి దారుణంగా హత్య చేసిన దుండగులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Kanpur

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో సీనియర్ న్యాయవాది గయాదిన్ అహిర్వార్ ను దుండగులు అపహరించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టు నుండి ఇంటికి వెళ్తున్న ఆయనను క్లయింట్లుగా నమ్మించి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాత భూవివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.