పెరిగిన ధరలతో కత్తిమీద సాములా మధ్యాహ్న భోజన పథకం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కడప
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం మరియు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో వైఎస్సార్ కడప జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని వంట కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా బకాయిలు రాకపోయినా అప్పులు తెచ్చి మరీ వంటలు వండుతున్నామని వారు వాపోయారు. ప్రభుత్వం మార్కెట్ ధరలకు అనుగుణంగా వంట ఛార్జీలను ఎప్పటికప్పుడు సవరించి, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.