లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవన్న నెల్లూరు డీఎంహెచ్వో

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితులలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.