భారత్-చైనాలు విభేదాలు పరిష్కరించుకోవాలి: జిన్పింగ్ పర్యటన వేళ బీజింగ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
భారత్-చైనా సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల కోసం జిన్పింగ్ భారత్కు రానున్న తరుణంలో ఇరు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని కోరింది. భారతదేశంతో కలిసి మిత్రుడిగా, భాగస్వామిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది.