విశాఖ, కడపలో అక్రమ కట్టడాలపై అధికారుల ఉక్కుపాదం
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం, కడప
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై విశాఖపట్నం, కడపలో అధికారులు కొరడా ఝుళిపించారు. ఈనాడులో ప్రచురితమైన కథనంపై స్పందించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు.