ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులు ఎలాంటి శిక్షాత్మకమైనవి కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం అర్హులైన ఉద్యోగులను సర్వీసు నుంచి ముందస్తుగా రిటైర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. చత్తీస్గఢ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించినట్లు అధికారులు తెలిపారు.