రాజమండ్రి రూరల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పురందేశ్వరి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఈ కార్యక్రమాల్లో ఆమె పేర్కొన్నారు.