తిరుపతిలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం: భ్రూణహత్యల నివారణకు వైద్యాధికారుల పిలుపు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి నుంచి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సదస్సులో వైద్యులు ప్రసంగిస్తూ బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. భ్రూణహత్యల నిర్మూలనకు సమాజం కృషి చేయాలని కోరారు. లఘు చిత్రాల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.