ఇరాన్ కార్గో నౌకపై దాడి, గల్ఫ్ దేశాల సమావేశం వాయిదా

రిపోర్టర్: గోపి స్థలం: World

ఇరాన్‌లోని కెస్మ్ దీవి సమీపంలో కార్గో నౌకపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో మస్కట్‌లో జరగాల్సిన గల్ఫ్ దేశాల ఉన్నత స్థాయి సమావేశం వాయిదా పడింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయానంపై చర్చించాల్సిన ఈ భేటీని ఇరాన్, ఒమన్‌లు సంయుక్తంగా వాయిదా వేసినట్లు ప్రకటించాయి.