పేదల ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వంపై మాజీ మంత్రి పువ్వాడ ఆగ్రహం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ప్రభుత్వంలో అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం వల్ల పేద ప్రజల ఇళ్లను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం శ్రీనివాస నగర్ నివాసితులతో సమావేశమై మాట్లాడారు. అధికారంలో కేసీఆర్ లేరని, పువ్వాడ అజయ్ లేరని భావించి, పేదల ఇళ్లకు రక్షణ లేకుండా చేసి కూల్చివేస్తున్నారని విమర్శించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతుందన్నారు.