బెంగళూరులో రైళ్లపై రాళ్ల దాడి నిఘా కెమెరా మాయం
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని బానసవాడి రైల్వే స్టేషన్ సమీపంలో రైళ్లపై రాళ్ల దాడిని నిరోధించడానికి ఏర్పాటు చేసిన సోలార్ సీసీటీవీ కెమెరా మాయమైంది. తక్కువ ఎత్తులో ఉండటంతో దుండగులు దీనిని ధ్వంసం చేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రక్షణ కోసం పెట్టిన కెమెరాలే చోరీకి గురికావడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.