యాదాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా సాగిన మహా గణపతి హోమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకష్టహర చతుర్థి పురస్కరించుకుని మహా గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛారణలతో హోమ ద్రవ్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు పూర్తి చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.