మహిళల భద్రతకు సమాఖ్య కమిటీలు: మండల స్థాయిలో నూతన కార్యవర్గాల ఎన్నిక

రిపోర్టర్: User స్థలం: చిట్వేల్

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా సమాఖ్య తిరుపతి జిల్లా కార్యదర్శి బి. నదియా తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహాసభలు నిర్వహించి నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళలకు ఏ సమస్య ఎదురైనా స్థానిక కమిటీల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.