రష్మిక నటించిన మైసా సినిమా టీజర్ విడుదల మరియు రిలీజ్ డేట్ ఖరారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భారతదేశం
ప్రముఖ నటి రష్మిక ప్రధాన పాత్రలో రవీందర్ పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మైసా సినిమా టీజర్‌ను దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. గిరిజన యువతిగా రష్మిక పగ, ఆవేశం, తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.