హిందూ వ్యతిరేక బుద్ధితోనే రాముడిపై కాంగ్రెస్ వ్యాఖ్యలు అంటూ బీజేపీ ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: Telangana
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి, హిందూ వ్యతిరేక బుద్ధికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ (@BJP4Telangana) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే ఆ పార్టీ నేతలు ఇప్పుడు దేవుళ్ల మధ్య కూడా విభజన గీతలు గీస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో కుల చిచ్చు పెట్టింది చాలక దేవుళ్లనూ రాజకీయాలోకి లాగుతున్నారని ఆరోపించారు.