మహిళా సీఈఓలపై వివాదాస్పద వ్యాఖ్యలు: మెకిన్సే డైరెక్టర్ క్రిస్ బ్రాడ్లీ తొలగింపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Global

మహిళా సీఈఓలపై సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ పార్ట్నర్ క్రిస్ బ్రాడ్లీని ఆ సంస్థ కీలక పదవుల నుండి తొలగించినట్లు సంస్థ అధికార ప్రతినిధి టేలర్ బర్న్స్ వెల్లడించారు. సంస్థ నిర్వహించిన ప్రవర్తనా సమీక్ష అనంతరం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మహిళా నాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంస్థ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.