శ్రావణ శోభతో పులకించిన అమ్మవారి దివ్య దీపకాంతులు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సామూహిక మహాలక్ష్మి దీప పూజలు మరియు లక్ష్మీ కుబేర కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన ముగ్గురు మహిళా భక్తులకు పట్టు చీరలను బహుకరించారు. ఈ ధార్మిక కార్యక్రమానికి కాకుమాని చెంచు నరసింహులు దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.