ఏపీఎస్సార్టీసీ జేఏసీకి చర్చల ఆహ్వానం: టెండర్ల రద్దుపై ఉత్కంఠ

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

ఆర్టీసీ జేఏసీ నేతలను జేఎండీ చర్చలకు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 23న విజయవాడ ఆర్టీసీ హౌస్లో ఈ సమావేశం జరగనుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ పరిరక్షణ కోసం సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం జరిపే ఈ చర్చలు సఫలం అవుతాయా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.