విజయనగరంలో బాలికపై లైంగికదాడి: ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరంలో తొమ్మిదో తరగతి బాలికను ఏడాదిగా బ్లాక్మెయిల్ చేస్తూ ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. అక్షయ్, శ్రీకాంత్, చంద్రశేఖర్ అనే నిందితులు బాలికను బెదిరించి రూ.30 వేలు వసూలు చేయడమే కాకుండా అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.