విజయవాడలో భీభత్సం సృష్టించిన యువతి దారుణ హత్య మిస్టరీ
రిపోర్టర్: హరి
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని యువతి మొండెంతో పాటు తాజాగా చేతులు, కాళ్లు, తల భాగాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. దుండగులు యువతిని దారుణంగా చంపి ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగి మూడు రోజులు అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, యువతి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె వివరాలు సేకరించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.