స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: త్వరలో శాసనసభలో ప్రత్యేక తీర్మానం
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
ఎమ్మెల్సీ తాతా మధు తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకోవడం తన గుండెను తరుక్కుపోయేలా చేసిందని భావోద్వేగానికి గురయ్యారు. సభాపతి స్థానాన్ని అవమానించేలా మాట్లాడిన తీరును తేలికగా తీసుకోబోమని, త్వరలోనే అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి మండలికి సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.