టెక్కీలకు తప్పని తిప్పలు: రాత్రి వేళ మీటింగ్లపై ఉద్యోగి నిలదీత

రిపోర్టర్: కిరణ్ స్థలం: బెంగళూరు

అమెరికా సహోద్యోగుల కోసం భారతీయ ఉద్యోగులు మాత్రమే రోజూ వ్యక్తిగత సమయాన్ని ఎందుకు త్యాగం చేయాలని బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. ఉదయం పూట జరగాల్సిన నిత్య సమావేశాన్ని అమెరికాలోని డేలైట్ సేవింగ్ సమయ మార్పుల కారణంగా సాయంత్రం ఏడు గంటలకు మార్చారని, దీనివల్ల తమకు వ్యక్తిగత సమయం లేకుండా పోతోందని ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఆవేదన వ్యక్తం చేశారు.