టీమిండియాలో చోటుపై విమర్శలను ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేస్తున్న నమన్ ధీర్
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
వెస్టిండీస్ సిరీస్కు ఎంపికైన నమన్ ధీర్ తన అద్భుత ప్రదర్శనతో విమర్శలకు దీటుగా బదులిస్తున్నారని సహచర ఆటగాళ్లు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ ఆల్ రౌండర్, పట్టుదలతో ముందుకు సాగుతూ జాతీయ జట్టులో కీలక స్థానం సంపాదించుకున్నారని ఆయన బాల్య స్నేహితుడు సాహజ్ ధావన్ వెల్లడించారు. దేశవాళీ టోర్నీల్లో రాణించడం ద్వారానే ఈ యువ ఆటగాడు భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలిగాడని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేశారు.