ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో విశాఖవాసులు దుర్మరణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. శుభకార్యం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన జీటీ ప్రసాద్ భార్య మరియు కోడలు నేహా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ వీడీసీఏ జాయింట్ సెక్రటరీ అయిన జీటీ ప్రసాద్ కళ్లెదుటే భార్య, కోడలు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాలు సుమారు పది రోజుల తర్వాత విశాఖకు చేరే అవకాశం ఉంది.