విజయనగరం అభివృద్ధికి ఊపు: రూ.3,329 కోట్ల భారీ పెట్టుబడులతో నూతన ప్రాజెక్టులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక రంగం మరింత విస్తరిస్తుందని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక పారిశ్రామిక కార్యక్రమాల్లో భాగంగా రూ.3,329 కోట్ల భారీ పెట్టుబడులతో త్వరలో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని వివరించారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రీజినల్ సమ్మిట్ వేదికగా ఈ ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. ఈ నూతన ప్రాజెక్టుల ద్వారా సుమారు 1,933 మంది స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన స్పష్టం చేశారు.