కొత్త కాలేజీల ఏర్పాటుపై ప్రత్యేక సబ్ కమిటీ దేవేంద్ర ఫడ్నవీస్

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

మహారాష్ట్రలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీల ఐదేళ్ల ప్రణాళిక పరిధిలోకి రాని ప్రాంతాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు పరిశీలనకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. ముంబైలో జరిగిన మహారాష్ట్ర స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం సీఈటీ పరీక్షా కేంద్రాలను కూడా పెంచాలని ఆయన ఆదేశించారు.