రాయగిరిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు: ఘన నివాళులు

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, రత్నపురం బలరాం, బెజ్జంకి రామకృష్ణారెడ్డి, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.