అమెరికా ఇరాన్ దేశాల మధ్య నిలిచిపోయిన దౌత్య చర్చలు

రిపోర్టర్: శివ స్థలం: న్యూయార్క్

అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఖతార్ దేశం చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలకు ఎలాంటి పురోగతి లభించలేదని నిపుణులు తెలిపారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ మధ్యవర్తులు జరిపిన చర్చలు ప్రతిష్టంభనకు గురయ్యాయని సమాచారం. అమెరికా ఆంక్షలు తొలగించాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అణ్వస్త్ర ప్రణాళికలు విరమించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలు విఫలమవడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.