హిమాలయాల్ లో విషాదం: నేపాల్ లో గల్లంతైన ఆరుగురు భారతీయ పర్యటకులు
రిపోర్టర్: విజయ్
స్థలం: నేపాల్
నేపాల్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఆరుగురు భారతీయ పర్యటకులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. అత్యంత లోతైన షే ఫోక్సుండో సరస్సు వద్దకు ట్రెక్కింగ్ వెళ్లిన వీరు, భారీగా మంచు కురవడంతో మార్గమధ్యంలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. గల్లంతైన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం నేపాల్ సైన్యం సహా స్థానిక యంత్రాంగం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.