శ్రీనగర్ కాలనీలో మొక్కలు నాటిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్ సిబ్బంది శ్రమదానం చేయడంతో పాటు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు అందరూ మొక్కలు నాటాలని బ్రాంచ్ మేనేజర్ జి.సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.