స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నేతల రాస్తారోకో
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం వినోద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నాయకులు మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.