కుభీర్ మండలంలో కురిసిన వర్షంతో రైతన్నల హర్షం
రిపోర్టర్: రాము
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గత నెల రోజులుగా వర్షం లేక ఎండిపోతున్న సోయాబీన్, పత్తి పంటలకు శనివారం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. మధ్యాహ్నం నుంచి కురిసిన ఈ వానతో పొలాల్లో తేమ పెరిగి, వాడిపోతున్న పంటలకు ప్రాణం వచ్చినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు కురిస్తే దిగుబడులు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.