చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానంటూ మున్సిపల్ అభ్యర్థి నజీర్ ప్రచారం

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి డి.నజీర్ అహ్మద్ చేనేతపురి ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.