రైతులపై కక్ష సాధింపు తగదంటూ రేవంత్ ప్రభుత్వంపై ఈటల ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ పై కోపం ఉంటే ఆయనపై తీర్చుకోవాలని, అంతేతప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు తగవని ఎంపీ ఈటల రాజేందర్ రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ఎల్ నినో రాబోతోందని ముందుగా హెచ్చరించినా సర్కార్ స్పందించలేదని, ముందస్తు సోయి లేకుండా వ్యవహరించి ఇప్పుడు కేంద్రం ప్యాకేజీ ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.