అయినవిల్లిలో ఘనంగా ముగిసిన కడలి వారి పాలెం వినాయక నిమజ్జనం
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అయినవిల్లి
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం కడలి వారి పాలెం గ్రామంలో వినాయక నవరాత్రి వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగగా, ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయక విగ్రహాన్ని కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.