ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీలో ప్రతిష్టంభన కొనసాగింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీ ఎలాంటి తుది నిర్ణయం లేకుండా ముగిసింది. ఈ నెలాఖరు నాటికి పీఆర్సీ నివేదిక తెప్పిస్తామని సీఎస్ హామీ ఇచ్చినా, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్థిక పరమైన నిర్ణయాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు.