విజయనగరం జిల్లాలో వరద బీభత్సం: నదుల ఉప్పొంగుతో ముంపునకు గురైన గ్రామాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా వంగర మండలం కొండ చాకరాపల్లి మరియు కొప్పర గ్రామాల్లోకి సువర్ణముఖి నది నుంచి వరద నీరు వచ్చి చేరిందని స్థానికులు తెలిపారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస జలాశయంలోకి భారీగా నీరు చేరుతుండటంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి విడుదల చేశారు. వేగావతి, సువర్ణముఖీ నదుల ద్వారా భారీగా నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.