రౌడీషీటర్లకు విశాఖ పోలీసుల వార్నింగ్: పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లలో అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజాశాంతికి ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులోనూ పీడీ యాక్ట్ అమలుచేస్తామని VizagCityPolice స్పష్టం చేశారు. సత్ప్రవర్తనతో మెలగాలని, చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని రౌడీషీటర్లను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.