బీహార్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: రమేష్ స్థలం: Bihar

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామినేషన్ నాలుగో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా బీహార్ విద్యా శాఖలో మొత్తం 32,388 పాఠశాల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 30, 2026 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని కమిషన్ వెల్లడించింది.