ఓడిపోయినప్పుడే రిగ్గింగ్ అనిపిస్తుందా: మాజీ అధికారుల బహిరంగ లేఖ కలకలం

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

భారత ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ, ఈసీకి మద్దతుగా 124 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఓడిపోయినప్పుడే రిగ్గింగ్ అనిపించడం సరికాదని ఆ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు.