ఏపీ లాసెట్ పీజీఎల్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎస్పీఈ

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి లాసెట్, పీజీఎల్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రవేశాల కోసం సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.