ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు: కందాళ ఉపేందర్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుసుమంచి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత ధోరణి ఎక్కువ కాలం సాగదని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. కూసుమంచి చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన తీవ్రంగా స్పందించారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అసెంబ్లీ వద్ద ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. పోలీసుల మార్క్ అణచివేతతో పాలన సాగించడం సరికాదని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని కందాళ స్పష్టం చేశారు.