అల్లూరి జిల్లాలో గంజాయి రహిత సమాజమే లక్ష్యం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి, నేర రహిత సమాజమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.నిశాంత్ ఆదేశించారు. పాడేరు కలెక్టరేట్‌లో ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి ఆమె దిశా నిర్దేశం చేశారు. గంజాయి సాగు, రవాణా అణచివేతకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.