బొబ్బిలి శ్రీచైతన్య కళాశాలలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్చార్జ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ వై. ప్రసాద్ సమక్షంలో 370 మంది విద్యార్థులు ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
భారత్ ను వ్యసన ముక్తి భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, రాజయోగ మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని జయించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.