గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: సతీష్
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని వనరులను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ, టీబీ కేసుల గుర్తింపు, ఇమ్మ్యూనైజేషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మంగళవారం పది నిమిషాల కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.