విజయనగరంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జమ్ము కోమటి చెరువు వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.