రాజాపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం బేగంపేట వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న గజం సత్యనారాయణ, కడవేరుగు కుమార్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తక్కియుద్దీన్ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.